ఉద్యాన పంటల సాగు లాభదాయకం
బయ్యారం: ఉద్యానవన పంటల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి జినుగు మరియన్న అన్నారు. మండలంలోని కాచనపల్లి పంచాయతీ పరిధిలో సాగులో ఉన్న మామిడి, ఆయిల్‌పామ్, మిరప పంటలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 13,011 ఎకరాల్లో మామిడిపంట సాగులో ఉందని ప్రస్తుతం సీజన్ ప్రారంభమవుతున్నందున మామిడి రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదేవిధంగా పండ్ల తోటల్లో అంతరపంటలుగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలతోపాటు పండ్ల పంటలను సాగు చేయాలన్నారు. ఉద్యానవన పంటలపై రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు అవసరం ఉన్నా.. తమ శాఖ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఏ.జె.శాంతి ప్రియదర్శిని, కార్యాలయ అధికారి శ్రీనివాసరావు, రైతులు నరసింహరావు, భిక్షం, వజ్జయ్య, శ్రీనివాస్, ఉమ, యాకన్న తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి మరియన్న
Comments
Please login to add a commentAdd a comment