వృథాగాపోతున్న తాగునీరు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ లోని పలు వీధుల్లో రోడ్ల పక్కన భూమి లోపల ఏర్పా టు చేసిన తాగునీటి పైపులు పగులుతున్నాయి. తరచూ పైపులు పగులుతుండటంతో తాగునీరు వృథాగా పోతోంది. అలాగే కొన్నిచోట్ల పైపులు పగిలిన ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోంది.
1969లో వీధుల్లో పైపులైన్..
డోర్నకల్ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు 1969లో వీధుల్లో పైపులైన్ ఏర్పాటు చేశారు. మున్నేరువాగు నుంచి పైపులైన్ ఏర్పాటుతో పాటు ట్యాంకులను నిర్మించి ప్రజలకు తాగునీటిని సరఫరాను ప్రారంభించారు. అయితే పైపులైన్ ఏర్పా టు చేసి 55 ఏళ్లు పూర్తికావడంతో భూమి లోపల పైపులు శిథిలావస్థకు చేరుకుని పగులుతున్నాయి.
రోడ్ల నిర్మాణంతో..
పైపులైన్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడంతో వాహనాల రాకపోకలతో భూమిలోపల ఒత్తిడికి గురై పగులుతున్నాయి. ముఖ్యంగా భారీ వాహనాల రాకపోకలతో మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్, జెడ్పీ స్కూల్ సెంటర్, పాత డోర్నకల్ ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలతో పైపులు పగులుతున్నాయి. రోడ్లు, సైడ్ డ్రెయినేజీల నిర్మాణాలు, నెట్‌వర్క్ సంస్థల కేబుల్ వైర్ల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో పైపులు పగులుతున్నాయి. దీంతో నీరు వృథాగా పోతుండటంతో పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలు తీరడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు స్పందించి వీధుల్లో నూతన పైపులైన్ల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
డోర్నకల్‌లో పలుచోట్ల తాగునీటి
పైపులకు పగుళ్లు
Comments
Please login to add a commentAdd a comment