రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు నేటి నుంచి ఈ నెల 31వరకు జరుగుతాయన్నారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు రోడ్లపై గుంతలను గుర్తించి, కూడలి రోడ్లను అభివృద్ధి చేయడం, స్కూల్ జోన్‌వివరాలు, పాఠశాలల చిహ్నాలు లేనివాటిని గుర్తించి సరి చేస్తామన్నారు. ఈ నెల 9నుంచి 15వరకు హెల్మెట్, సీటుబెల్ట్, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు, తనిఖీలు, డిజిటల్ ప్రచారం నిర్వహిస్తామన్నారు. 16నుంచి 23వరకు పాఠశాలల్లో ట్రాఫి క్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు, పాఠశాలల్లో కరపత్రాల పంపిణీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. 24 నుంచి 30వరకు పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన, రవాణాచట్టం అమలు గురించి తెలియజేయడం, రేడియం స్టికర్లు లేని వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. 31న రోడ్డు భద్రతా నియమాలపై ముగింపు సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సాయిచరణ్, వెంకట్‌రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి
నెహ్రూసెంటర్: రోడ్డు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవర్లు బస్సులను నడపాలని డీటీఓ జైపాల్‌రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. డీటీఓ మాట్లాడుతూ.. ఆర్టీసీ అత్యున్నత ప్రజల సంస్థ అని, డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగులు పాపిరెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రవాణాశాఖ అధికారి జైపాల్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment