శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలి
– 10లో
పాసింగ్ అవుట్ పరేడ్
నిర్వహిస్తున్న శిక్షణ కానిస్టేబుళ్లు
మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ ప్రాంగణంలో శుక్రవారం ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 453 మంది స్పెషల్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ (పాసింగ్ అవుట్) పరేడ్ ఉత్సాహంగా సాగింది. ముఖ్యఅతిథిగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి హాజరయ్యారు. ప్రత్యేక వాహనంపైనుంచి స్పెషల్ కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు మార్షల్‌ఆర్ట్స్ ప్రదర్శించారు. అనంతరం తరుణ్‌జోషి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. – ఖిలా వరంగల్
Comments
Please login to add a commentAdd a comment