మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేశారు. మానుకోట మున్సిపాలిటీలో 90 శాతం పూర్తి చేశారు. డిసెంబర్ 31వరకు గడువు ఇవ్వగా.. సర్వే పూర్తి కాకపోవడంతో గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. కాగా మున్సిపాలిటీలో మరో మూడు రోజుల్లో సర్వే పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 16నుంచి సర్వే..
2023 డిసెంబర్ 28నుంచి 2024 జనవరి 6వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. దానిలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. కాగా ఆ దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను డిసెంబర్ 16న చేపట్టారు. మొబైల్ ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నారు.
15,185 దరఖాస్తులు పూర్తి..
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నా యి. కాగా వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బందికి సర్వే బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 16 నుంచి 51 మంది సర్వే చేపడుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో 16,824 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని ప్రకారం సర్వే చేపట్టగా డిసెంబర్ 29వ తేదీ వరకు 15,185 దరఖాస్తుల సర్వే పూర్తి చేశారు. 1,639 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
మానుకోట మున్సిపాలిటీలో
90 శాతం పూర్తి
16,824 దరఖాస్తులకు
15,185 కంప్లీట్
ప్రజాపాలన దరఖాస్తుల
సమాచారంతోనే సర్వే
Comments
Please login to add a commentAdd a comment