సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల ని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమాశానికి ఆ యన హాజరై మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నా రు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రత్యామ్నా య ఏర్పాట్ల వల్ల అటు కేజీబీవీ, ఇటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నా రు. ప్రభుత్వం సమగ్రశిక్ష ఉద్యోగులను విచ్ఛినం చేసి వారిని భయపెట్టే విధంగా చర్యలు తీసుకోవ డం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల నిర్ణయాన్ని వెనక్కితీసుకొని వెంటనే సమగ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్, నాయకులు విష్ణువర్ధన్, శ్రీశైలం, రాజు, వివిధ మండలాల బాధ్యులు విద్యాసాగర్, యాకయ్య, గోవర్ధన్, శ్రీనివాస్, కార్తీక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment