సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: పదో తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బీరవెల్లి రవీందర్ రెడ్డి, అనిత కుటుంబ సభ్యులు అందించిన స్టడీ మెటీరియల్స్‌ను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏఓ మహంకాళి బుచ్చయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం లక్ష్మారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యశంకర్, ఉపాధ్యాయ బృందం దానయ్య, ఫహీం, శశిధర్, భరత్ కుమార్, అనిత, కుమార్, రమేష్, నరేష్ తదితరలు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment