పగిలిన పైపులకు మరమ్మతులు
డోర్నకల్: స్థానిక జెడ్పీ స్కూల్ రోడ్డులో భూమి లోపల పగిలిన పైపులకు మంగళవారం మున్సిపల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. ఇటీవల పలు వీధుల్లో పైపులు పగిలి నీరంతా వృథాగా పోతున్న పరిస్థితులపై సాక్షి దినపత్రికలో ‘వృథాగా పోతున్న నీరు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కాగా దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది భూమిలో పగిలిన పైపులకు మరమ్మతులు చేశారు. పైపులకు మరమ్మతులు చేయించి నీటి వృథాను అరికట్టేందుకు కృషి చేసిన సాక్షి దినపత్రికతో పాటు కమిషనర్, సిబ్బందికి స్థానికులు ధన్యవా దాలు తెలిపారు.
బోర్డుకు ముసుగేశారు...
డోర్నకల్: స్థానిక అగ్నమాపక కేంద్ర భవనంపై నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయ సూచిక బోర్డు సగభాగాన్ని మంగళవారం కప్పేశారు. సూచిక బోర్డులో డోర్నకల్ పేరును తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ‘డొంకల్’గా ముద్రించడంపై సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది డొంకల్ పేరు కనిపించకుండా టార్పాలిన్ షీట్‌తో కప్పేశారు. బోర్డులోని తప్పులను సరిచేస్తామని సిబ్బంది తెలిపారు.
చట్టాలపై
అవగాహన కలిగి ఉండాలి
డోర్నకల్: సమాజంలో ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్ సబ్‌కోర్టు జడ్జి సి.సురేష్ అన్నారు. మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో మంగళవారం చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలతో పాటు హక్కులు, బాధ్యతలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డోర్నకల్ ఎస్సై వంశీధర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
సేవా పతకాలకు ఎంపిక
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసుశాఖ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు పోలీ సు అధికారులు, సిబ్బంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఒకరిని ఉత్తమ సేవా పతకాని కి, పదిమందిని సేవా పతకాలకు ఎంపిక చేస్తూ హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్త, డీజీపీ జితేందర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తమ సేవా పతకానికి ఏఆర్ ఎస్సై ఇబ్రహీంఖాన్, సేవా పతకాలకు నాగ య్య (సీరోలు ఏఎస్సై), కిషన్ (డీఎస్బీ ఏఎ స్సై), అహ్మద్ (డీసీఆర్బీ ఏఎస్సై), సదానందం (ఎస్బీ ఏఎస్సై), రమేశ్ (మహబూబా బాద్ రూరల్ ఏఎస్సై), లక్ష్మిరంగయ్య (పెద్దవంగర ఏఎస్సై), యాకూబ్ రెడ్డి (ఎస్బీ హెడ్ కానిస్టేబుల్), వెంకన్న (నర్సింహులపేట హెడ్ కానిస్టేబుల్), నర్సయ్య (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), వెంకన్న (ఏఆర్ పీసీ) ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment