స్కానింగ్ సెంటర్లపై నిఘా
నెహ్రూసెంటర్: జిల్లాలో అక్రమాలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిటీ సభ్యుల పరిశీలన అనంతరం నూతన స్కానింగ్ సెంటర్లను మంజూరు చేయాలని సూచించారు. సెంటర్లలో అర్హత గలవారిని నియమించాలన్నారు. సమావేశంలో పీఓ సారంగం, కమిటీ సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్రవంతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, ప్రభుత్వ న్యాయవాది నగేష్‌కుమార్, సీడీపీఓ శిరీష, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్స్ కేవీ రాజు, అరుణ్‌కుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులు నమోదు అయ్యేలా చూడాలి..
మరిపెడ: ప్రతి గర్భిణి మొదటి మూడు నెలల్లో ఆస్పత్రిలో నమోదు అయ్యేలా చూడాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ వైద్య సిబ్బందికి సూచించారు. మరిపెడ పీహెచ్‌సీని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం వైద్య శిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి గుగులోతు రవికుమార్, డాక్టర్ స్వామి, సూపర్‌వైజర్లు కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మీమాధవి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment