ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
గార్ల: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, గార్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండటంతో, కాంటాలు పెట్టడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యానికి సంబంధించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతులకు డబ్బులు త్వరగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ రవీందర్, ఏఓ రామారావు, సిబ్బంది భీముడు, రవి తదితరులు పాల్గొన్నారు.
త్వరగా చెల్లించాలి
బయ్యారం: కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు త్వరగా రైతులకు చెల్లింపులు జరిగేలా అధికారులు చూడాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి–కొత్తపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు చేసిన ధాన్యం రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ, ఏఓ రాంజీ, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తరలింపు వేగవంతం చేయాలి..
డోర్నకల్: కొనుగోలు కేంద్రాల్లో సేకరించని ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని తహసీల్దార్ బంజర, డోర్నకల్, గొల్లచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి, ఐకేపీ ఏపీఎం శంకర్‌నాయక్, వ్యవసాయ అధికారి మురళీమోహన్, ఏఈఓ ఎర్ర కర్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment