పరిశోధన పత్రాలకు ఆహ్వానం
కాళోజీ సెంటర్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈఆర్‌టీ) పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తోంది. సైన్స్ టీచర్ల మేధస్సుకు పదునుపెట్టేందుకు ఇందులో పలు అంశాలు ఉన్నాయి. సైన్స్ బోధనలో కృత్రిమ మేధ చర్య లేదా ప్రభావం, పాఠశాలల్లో సుస్థిర పర్యావరణ వ్యవస్థ నిర్వహణ, వ్యూహాలు, విద్యార్థుల శ్రేయస్సుకు ఆహార విద్య, ఉపాధ్యాయుల పాత్ర, సైన్స్‌లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాసీ్త్రయ మార్గాలు, రసాయన శాస్త్రం నేర్చుకునేందుకు సాధనాలు, నూతన పద్ధతులతో వినూత్న బోధనా విధానాలుగా విభజించారు. విద్యార్థులను విజ్ఞానవంతులుగా తయారు చేయడానికి దోహదపడేలా పరిశోధనలు ఉండాలి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి జనవరి 20 వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్స్ టీచర్లకు పాల్గొనే అవకాశం కల్పించారు.
పీడీఎఫ్ రూపంలో పంపించాలి..
నిర్దేశించిన అంశాల్లో ఏదో ఒకటి వెబ్‌సైట్ లింక్ ద్వారా పరిశోధన పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు తమ పరిశోధన వెయ్యి పదాలకు మించకుండా ఇంగ్లిష్ లేదా తెలుగులో రాయాలి. పీడీఎఫ్ రూపంలో tgscertseminar@gmail.comకు పంపించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సైన్స్ టీచర్లతోపాటు బీఈడీ చేస్తున్న వారు కూడా తమ పరిశోధనలను పంపవచ్చు. ఎంపికై న ఉపాధ్యాయులు ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయిలో ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. వీటిలో మూడు ఉత్తమ పరిశోధనలకు ఎంపికచేస్తారు.
సైన్స్ టీచర్లకు చక్కటి వేదిక
సైన్స్ టీచర్ల మేధస్సుకు పదును పెట్టేందుకు ఎస్‌ఈఆర్‌టీ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 ఫిబ్రవరి 28న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది.సైన్స్ టీచర్లకు ఇది చక్కటి వేదిక. అవకాశం. ఆసక్తి గల సైన్స్ టీచర్లు, బీఈడీ అభ్యర్థులు విజ్ఞానవంతమైన వినూత్న ప్రదర్శలతో పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
–కట్ల శ్రీనివాస్, వరంగల్ జిల్లా సైన్స్ అధికారి
జనవరి 20వ తేదీ వరకు గడువు
సైన్స్ టీచర్ల మేధస్సుకు పదును
Comments
Please login to add a commentAdd a comment