సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
మహబూబాబాద్: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో ఎలాంటి సాయంలోనైనా లయన్స్ క్లబ్ ముందుంటుందని క్లబ్ ఇంటర్నేషనల్ 320 ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శనివారం పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు స్టడీ మెటీరియ ల్స్, సైకిళ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 90 క్లబ్‌లు ఉండగా 3,000 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఇటీవల 1,000 మంది పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన వారిలో 600 మందికి రూ.10 లక్షల విలువచేసే సామగ్రి పంపిణీ చేశామన్నారు. క్లబ్ మానుకోట అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆశాభవన్‌లో న్యూట్రిషన్ కిట్స్, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రూ.15 వేలు విలువచేసే ఆరు బెంచీలు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, క్లబ్ కార్యదర్శి అశోక్‌రెడ్డి, కోశాధికారి సిద్ధార్థ, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment