పులి తిరుగుతోంది.. జాగ్రత్త
కొత్తగూడ: కొత్తగూడ అటవీ ప్రాంతానికి పులి వచ్చిందని.. సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం కోనాపూర్ అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో పులి అడుగులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.. కాగా ఎక్కడైనా ఇంకా ఆనవాళ్లు కన్పిస్తాయేమోనని అటవీ శాఖ అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. తాగు నీటి గుంతలు ఉన్న చోట్ల అడుగులను వెతుకుతూ.. కెమెరా ట్రాప్‌లను బిగించారు. సమీప గ్రామాలు కోనాపురం, రేణ్యతండా, అంకన్నగూడెం, ఓటాయి, జంగవానిగూడెం గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరం అయితేనే అడవికి వెళ్లాలని, పశులను అడవి లోనికి వెళ్లకుండా గ్రామాల సమీపంలోనే మేపుకోవాలని సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో వజరహత్, ఎఫ్‌ఎస్‌ఓలు పద్మారావు, రాజేశ్, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.
పులి ఆనవాళ్ల కోసం అడవి బాట పట్టిన అటవీశాఖ అధికారులు
కెమెరా ట్రాప్‌ల బిగింపు
Comments
Please login to add a commentAdd a comment