పదోన్నతితో బాధ్యత పెంపు
మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి రావడంతో బాధ్యత మరింత పెంపొందుతుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన 11మంది కానిస్టేబుళ్లు శనివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ.. వారిని అభినందించి మాట్లాడారు. ప్రస్తుతం పదోన్నతి పొందిన వారు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సర్వీసులో మరిన్ని పదోన్నతులు పొందాని ఆకాంక్షించారు. పదోన్నతి పొందిన వారిలో రామరాజేశ్, ఏ.అశోక్, రవీందర్, సోమేశ్వర్, సురేశ్, రవూఫ్ పాషా, సదయ్య, బి.అశోక్, ప్రవీణ్ కుమార్, నర్సయ్య, దామోదర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment