విద్యార్థులకు పదో తరగతి కీలకం
మహబూబాబాద్ అర్బన్: ప్రతి విద్యార్థికి పదో తరగతి ఎంతో కీలకమని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం పది విద్యార్థుల స్టడీ మెటిరియల్స్ పంపిణీ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థులు స్టడీమెటీరియల్‌ను ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించాలని, గ్రామీణ పేద విద్యార్థులను ప్రోతహిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాడం అభినందనీయమన్నారు. విద్యార్థుల అల్పాహారానికి రూ.5 వేలు పాఠశాల ఉపాధ్యాయుడు సోమ రవి, స్టడీ మెటిరియల్‌కు రూ.13 వేలను గట్ల శ్రీపాల్‌రెడ్డి అందించడం గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పూజరి వీర య్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్ఫూర్తి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు రామసహాయం శ్రీధర్‌రెడ్డి సహకారంతో హనుమకొండ లయన్స్ క్లబ్‌కు చెందిన యర్రంరెడ్డి మహేందర్‌రెడ్డి స్టడీ మెటిరియల్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ నాగవాణి, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సేవ కార్యక్రమాలు అభినందనీయం
తొర్రూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిరంతరం లయన్స్ క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం సీడబ్ల్యూసీ జిల్లా చైర్ పర్సన్, లయన్స్ సేవా తరుణి ప్రతినిధి డాక్టర్ నాగవాణి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మాటేడు జిల్లా పరిషత్ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ అందించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చయ్య, హెచ్‌ఎం ప్రభాకర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాధవపెద్ది వాణి, శ్రీరాములు, రమణారెడ్డి, పినాకపాణి, శ్రీదేవి, రమణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాను మొదటిస్థానంలో నిలపాలి
చిన్నగూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆయన సందర్శించారు. అనంతరం దాతల సాయంతో సేకరించిన స్టడీ మెటీరియల్స్‌ను పదో తరగతి విద్యార్థలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 2 నుంచి నిర్వహించే చాప్టర్ వైస్ పరీక్షలు రాసి వందశాతం జీపీఏ సాధించాలన్నారు. పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎఫ్‌ఏఓ బుచ్చయ్య, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓ రవికుమార్, ఉపాధ్యాయులు రెహమాన్, సుగుణాకర్, నాగేశ్వర్‌రావు, రఘుపతి, ఉపేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment