నిరాడంబరంగా సీఎం కప్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఐదు రోజుల పాటు కొనసాగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. భారత మా జీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి క్రీడాలోకం సంతాపం తెలియజేసింది. క్రీడలు ప్రారంభించే ముందు అధికారులు, క్రీడాకారులు, టెక్నికల్ అఫి షీయల్స్, రెఫరీలు రెండు నిమిసాలు మౌనం పా టించి మాజీ ప్రధాని మన్మోహన్‌కు శ్రద్ధాంజలి ఘ టించారు. అనంతరం స్టేడియంలోని వాలీబాల్, బాల్‌బ్యాడ్మింటన్ మైదానాల్లో సెపక్‌తక్రా నిర్వహించగా హ్యాండ్‌బాల్ గ్రౌండ్‌లో హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించారు. కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు కొనసాగినట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శ్రద్ధాంజలి
Comments
Please login to add a commentAdd a comment