ప్రాణం తీసిన భూవివాదం..
● దారి అటకాయించి కర్రతో కొట్టి వృద్ధుడి హత్య
● కాటారం మండల కేంద్రంలో ఘటన
కాటారం: భూ వివాదాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రైతు కుటుంబాల్లో సంతో షాన్ని నింపే నేలలు.. వివాదాస్పదంగా మారి రక్తపు మడుగులతో అదే రైతు కుటుంబాల్లో వి షాదాలకు దారితీస్తున్నాయి. కొన్నేళ్లుగా భూమి హద్దుల విషయంలో నెలకొన్న గొడవలతో ఓ వృద్ధుడిని దారి అటకాయించి హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఇప్పలగూడేనికి చెందిన డొంగిరి బుచ్చయ్య(65)కు కాటారం శివారులోని సర్వే నంబర్ 501లో 1.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి హద్దుల విషయంలో సొదారి పోచయ్య, అతడి కుమారులు సమ్మయ్య, అంకయ్య, లింగ య్య, మృతుడు బుచ్చయ్య మధ్య మూడేళ్లుగా వివాదం కొనసాగుతోంది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా పరిష్కారం కా కపోవడంతో బుచ్చయ్య గత మే నెలలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే యగా కేసు కొనసాగుతోంది. కాగా, ఇదే విషయంలో బుచ్చయ్య శుక్రవారం ఉదయం భూమి వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో బుచ్చయ్యకు సొదారి లింగయ్య అతడి భార్య శోభ మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బుచ్చయ్య తన భా ర్య సారమ్మకు ఫోన్‌లో విషయం తెలిపి అక్కడి నుంచి బయలుదేరా డు. దాడి విషయం లింగయ్య తన కుమారుడు పవన్‌కు సమాచారం అందించాడు. ఆవేశానికి గురైన పవన్ ఇప్పలగూడెంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బుచ్చయ్య బైక్‌పై వెళ్తున్న క్రమంలో అటకాయించి కర్రతో కొట్టడంతో కిందపడ్డాడు. దీంతో పవన్ వెంటనే బుచ్చయ్య తలపై విచక్షణారహితంగా కొట్టడంతో మృతిచెందాడు. ఈ క్రమంలో మృతుడి భార్య సారమ్మ, కూతుళ్లు దుర్గం సుగంధ, జాడి శోభ పొలం వద్దకు వెళ్తూ బుచ్చయ్యపై దాడి జరగడాన్ని గమనించి అక్కడికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. హత్యకు పాల్పడిన పవన్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న కాటారం సీఐ నాగార్జునరావు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య సారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment