ఓరుగల్లులో సంస్కరణల సారథి
కేయూ క్యాంపస్ : 1992లో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆర్థిక సంస్కరణల సారథి డాక్టర్ మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. అప్పటి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కొత్తపెల్లి జయశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ ఆర్‌ఈసీ (ప్రస్తుత నిట్) ఆడిటోరియంలో కేయూ స్నాతకోత్సవం నిర్వహించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్‌తో కలిసి పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్‌మెడల్స్ ప్రదానం కార్యక్రమంలో మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. ప్రముఖ కవి దివంగత కాళోజీనారాయణరావు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు దివంగత నేరేళ్ల వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్‌సింగ్ 2004నుంచి 2014వరకు భారత ప్రధానిగా పదేళ్లపాటుసేవలు అందించారు. అంతకంటే ముందు అనేక పదవులు నిర్వర్తించారు. ఈనెల 26న రాత్రి మన్మోహన్ సింగ్ తుదిశ్వాసవిడిచిన విషయం విధితమే.
1992లో నిర్వహించిన కేయూ
స్నాతకోత్సవానికి మన్మోహన్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment