అట్టహాసంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ క్రీడోత్సవాలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు హనుమకొండ కేంద్ర బిందువుగా నిలుస్తోందన్నారు. ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ వరకు జరిగే పోటీలకు వివిధ జిల్లాల నుంచి 2 వేల మంది క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎండి. అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, రెజ్లింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ కరీం, కోచ్‌లు నరేందర్, శ్రీమన్నారాయణ, కందికొండ రాజు, బొడ్డు విష్ణువర్ధన్, ఓనపాకల శంకర్, కూరపాటి రమేశ్, కె.ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment