మహబూబాబాద్ అర్బన్: కస్తూర్బా విద్యాలయాల్లో బోధించే ఉపాధ్యాయులు, సమగ్రశిక్ష ఉద్యోగులతో కలిసి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యావ్యవస్థ కుంటుపడి.. విద్యార్థినులకు బోధించేవారు కరువయ్యారు. ఈమేరకు మంగళవారం ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. బయ్యారం కేజీబీవీ ఇన్‌చార్జ్‌గా పి.శైలజ, గార్ల కె.ప్రసన్న, గూడూరు జి.రజిత, చిన్నగూడూరు కె.లలిత, పెద్దవంగర పి.శేశవల్లి, డోర్నకల్ పి.సునీత, గంగారం స్వర్ణకుమారి, కేసముద్రం జె.సోమలక్ష్మి, కురవి కె.నవ్య, మమబూబాబాద్ వై.గాయత్రి, కొత్తగూడ కె.రాధ, మరిపెడ జి.ఉమారాణి, నర్సింహులపేట ఎస్.జానకీసుమాన, నెల్లికుదురు ఎండీ. అజీమ్‌మున్నీసా, తొర్రూరు ఎస్.సంధ్యారాణి, దంతాలపల్లి కేజీబీవీ ఇన్‌చార్జ్‌గా ఎస్.జానకీ సుమానను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment