10 నుంచి జాతీయ స్థాయి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జాతీయస్థాయి మెన్ అండ్ ఉమెన్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రిక్కల శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులు జరగనున్న ఈ పోటీల్లో దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు, 30 మంది టెక్నికల్ అఫిషీయల్స్ హాజరవుతారని తెలిపారు. పోటీలు టీం, రేగో, కార్డ్, డబుల్స్ విభాగాల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో కొనసాగుతాయని తెలిపారు. జేఎన్ స్టేడియంలోని హ్యాండ్‌బాల్, ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు.
బస్తాలో 45 కిలోల మిర్చి ఉండాలి
వరంగల్: మా ర్కెట్‌కు బస్తాలో 45 కిలోల కంటే ఎక్కువ మిర్చి తీసుకురా వొద్దని, ఎక్కువ బరువుతో తీసుకొస్తే నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటాయని మా ర్కెటింగ్ శాఖ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం యార్డును సందర్శించి రైతులు తీసుకొచ్చిన మిర్చిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తేమ ఎక్కువగా లేకుండా పంటను రైతులు పొలంలోనే ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలన్నారు. అలా తీసుకొచ్చిన పంటకు గిట్టుబాటు ధర పలుకుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల, అడ్తి, మిర్చి సెక్షన్ల అధ్యక్ష, కార్యదర్శులు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment