● వృద్ధులు, దివ్యాంగుల తిప్పలు
జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో సోమవారం ప్రత్యేక ఉపకరణాల ఎంపిక కోసం క్యాంపు నిర్వహించగా.. వందల సంఖ్యలో వృద్ధులు, దివ్యాంగులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపునకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వృద్ధులు, దివ్యాంగులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. భవనం లోపలికి వెళ్లేందుకు సరిపడా వీల్‌చైర్లు లేవు. దీంతో వెంటవచ్చిన వారు దివ్యాంగులను మోసుకెళ్లారు. ఎలాగోలా లోపలికి వెళ్లి దరఖాస్తులు అందజేశారు.
–సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment