28న మెగా జాబ్‌మేళా
మహబూబాబాద్ అర్బన్: ఐటీడీఐ ఏటూరునాగారం ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 10:30గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గుగులోత్ దేశీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీ పార్మసీ, డీ ఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు తమ బయోడేటా, విద్యార్హతలు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 80089 32159, 79816 33716 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్: జిల్లాలోని దివ్యాంగులు స్వయం ఉపాధి పథకం యూనిట్ల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీడబ్ల్యూఓ దనమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అర్థిక సంవత్సరానికి గాను నాన్ బ్యాంక్ లింకేజీ కింద మండలానికి ఒకటి, మున్సిపాలిటీకి ఒక యూనిట్ చొప్పున మొత్తం 21 యూనిట్లు మంజూరైనట్లు చెప్పారు. యూనిట్‌కు రూ.50,000 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆసక్తి, అర్హత గల వారు ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండలం అయితే మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం 91334 15312, 91772 60816 నంబర్లలో సంప్రదించాలన్నారు.
విద్యాసంస్థల్లో ప్రవేశాలకు..
మహబూబాబాద్ అర్బన్: సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలు, కళాశాలలతో పాటు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నుట్లు మల్టీజోన్ ఆఫీసర్ కె.అలివేలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. అలాగే 6 నుంచి 10, ఇంటర్‌లో మిగిలిన ఖాళీ సీట్లలో ప్రవేశాలకు కూడా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలకు టెండర్లు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి నుంచి జరగనుండడంతో ఆలయంలో వివిధ ఏర్పాట్ల కోసం శుక్రవారం ఆలయ ఆవరణలో టెండర్లు నిర్వహించారు. ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తల సమక్షంలో తక్కువ కోట్ చేసిన టెండర్లు ఓపెన్ చేశారు. తడకల పందిర్లు వేయడం కోసం రూ.1,87,500, బార్‌కేడింగ్, క్యూలైన్‌ల కోసం రూ.85వేలు, విద్యుత్‌దీపాల అలంకరణ రూ.4.25లక్షలు, ఆల యం, కల్యాణ మండపానికి పూల అలంకరణ రూ.1.85లక్షలు, ఆలయానికి రంగులు వేసేందుకు రూ.2.25లక్షలు, కల్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారాల ఎల్‌ఈడీల ఏర్పాటుకు రూ.1.85లక్షలు, రంగులు, సున్నాలు సప్లై చేసేందుకు కురవి అనురాధ ఏజెన్సీస్ రూ.4,83,660, కలకత్తా పెండ్యాలు వేసేందుకు రూ.4లక్షలు, తెప్పోత్సవ పూల అంకరణకు రూ.70వేలు, తెప్పోత్సవ విద్యుత్ దీపాలంకరణకు రూ.53వేలు, కల్యాణమండపంలో బార్‌కేడింగ్, క్యూలైన్‌ల ఏర్పాటును రూ.1.70 లక్షలకు టెండర్ల ద్వారా దక్కించుకున్నారు.
ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కంప్యూటర్ సైన్స్‌విభాగం కేంద్రంలో పరీక్షల తీరుతెన్నులను పరీక్షల నియంత్రణాఽధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసింఇక్బాల్, విభాగం అధిపతి డాక్టర్ రమ పరిశీలించారు.
నేటినుంచి పీజీ మూడో
సెమిస్టర్ పరీక్షలు..
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడివరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం పుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) శనివారం నుంచి జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ సౌజన్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 25, 27, 29, 31, ఫిబ్రవరి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 26 సెంటర్లను ఏర్పాటుచేయగా, 4,770 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment