వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేతవీరభద్రస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేజాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయానికి కావాల్సిన అవసరాలను గుర్తించి నివేదిక తయారు చేసి అందజేయాలని సూచించారు. గతంలో అభివృద్ధి పనులు ఎంత వరకు చేశారు? ఇంకా చేయాల్సిన పనులు ఏం ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో స్వామి వారి జాతర దృష్ట్యా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కై లాసభవనం స్థానంలో గెస్ట్ హౌస్ నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. జాతర ఆహ్వాన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ఇస్తామని వివరించారు. అభివృద్ధికి కావాల్సిన పనుల వివరాలను తయారు చేయాలని సూచించారు. సంతలో మరుగుదొడ్డి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, నాగేంద్రస్వామి ఆలయ ఆవరణను పరిశీలించారు. పలువురు అధికారులు, ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ఈఓ సత్యనారాయణ, ఆలయ మాజీ చైర్మన్ బాదావత్ రామునాయక్, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, భిక్షపతి, సంజీవరెడ్డి, శక్రునాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, నియోజకవర్గ నాయకుడు పి.రఘువీర్‌రెడ్డి, నాయకులు అవిరె మోహన్‌రావు, బాదె వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్
Comments
Please login to add a commentAdd a comment