రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతుందని ప్రభుత్వ విప్ తేజావత్ రాంచంద్రునాయక్, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మిర్చి కొనుగోళ్లు, సద్దిమూట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానుకోట వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమలుతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను రైతుల మేలుకోరి ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలందరికీ తప్పకుండా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చెప్పారు. డోర్నకల్ రైల్వే జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, మరిపెడలో వ్యవసాయ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మున్సిప్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మరోచోటుకు మార్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, ఏఎంసీ డైరెక్టర్లు ఆవుల కందయ్య, బాదావత్ బిక్కునాయక్, బండి శైలజ, బట్టు నర్సయ్య, సాదనాల వెంకటేశ్వర్లు, తేజావత్ వెంకన్న, దేశెట్టి మల్లయ్య, సయ్యద్ ఖాసిం, సంపంగి సులోచన, బానోత్ రాములు, వేమిశెట్టి యాకాంబ్రం, జంగాల నరసింహారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్
మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు, సద్దిమూట ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment