అర్హులకు పథకాలు అందించాలి
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
నెల్లికుదురు: అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాబితాల్లో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిలో మార్పు రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment