ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలి

Published Thu, Feb 13 2025 8:23 AM | Last Updated on Thu, Feb 13 2025 8:23 AM

ఎన్ని

ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలి

మహబూబాబాద్‌: రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి మినహా యింపు ఇవ్వాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్‌ అన్నారు. టీపీటీఎఫ్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మా ట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆరు నెలలలోపు ఉద్యోగ విరమణ పొందనున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించొద్దన్నారు. కార్యక్రమంలో చుంచు శ్రీశైలం, ఉపేందర్‌, రామలింగారెడ్డి, రమేశ్‌, శివకుమార్‌, బాలాజీ, శ్రీనివాస్‌, ప్రకాశ్‌, రవి, మధుసూదన్‌రావు, నరేశ్‌, ఉస్మాన్‌, నాగేశ్వర్‌రావు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు ఉపాధ్యాయులకు

మెమోలు

నర్సింహులపేట: మండలంలోని వశ్రాంతండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు మెమోలు జారీ చేయడంతో పాటు ఒకరోజు వేతనం కట్‌ చేసినట్లు ఎంఈఓ రామ్మోహన్‌రావు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా రావడం లేదనే సమాచారంతో బుధవారం తనిఖీ చేసినట్లు చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరుకావడంతో మెమోలు జారీ చేశామన్నారు. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరించారు.

డిజిటల్‌ బోర్డులపై

బోధించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరూ డిజిటల్‌ బోర్డులను వినియోగిస్తూ విద్యార్థులకు బోధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఏంజిల్స్‌ పాఠశాలలో బుధవారం పీఎం శ్రీ పాఠశాలల నిర్వహణపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతీ విద్యార్థికి అపార్‌ కార్డును అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీ రాజేశ్వరరావు, ఎఫ్‌ఏఓ మహంకాళి బుచ్చయ్య, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ పూర్ణచందర్‌, క్వాలిటీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఏసీ సంతోష్‌, హెచ్‌ఎంలు, రిసోర్స్‌పర్సన్స్‌ పాల్గొన్నారు.

ఫిర్యాదులు వస్తే

చర్యలు తప్పవు

అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి

మహబూబాబాద్‌: మీసేవ కేంద్రాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ సమావేశం మందిరంలో బుధవారం మీసేవ కేంద్రాల నిర్వాహకుల(వీఎల్‌ఈ)తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల పనితీరు ఉండాలన్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రతీ నెల సమావేశం నిర్వహించాలన్నారు. మీసేవ టెక్నికల్‌ సమస్యలు, సర్వీసులపై సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ప్రశాంత్‌, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఉద్యాన కళాశాలకు

స్థలం కేటాయించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం మల్యాల గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన కళాశాల కోసం రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించాలని తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్‌ బుఽ దవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మల్యాల గ్రామంలో ఉద్యాన కళాశాలను మంజూరు చేసిందని, ప్రస్తుతం ఉన్న జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానంలో ఉద్యాన కళాశాల నిర్మాణం కోసం అవసరమైన 20 నుంచి 25 ఎకరాల ఖాళీ స్థలం లేదన్నారు. కేవలం 3 నుంచి 4 ఎకరాల మాత్రమే ఖాళీ స్థలం ఉందని, దానిని భవిష్యత్‌ పరిశోధనల కోసం తమ పరిధిలో ఉంచామని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం మంజూరైన ఉద్యాన కళాశాలను మల్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయంపై గతంలో కలెక్టరేట్‌లో వినతిపత్రం కూడా ఇచ్చామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్నికల విధులనుంచి  మినహాయింపు ఇవ్వాలి 1
1/1

ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement