![వైభవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12mbd701-603343_mr-1739413979-0.jpg.webp?itok=qBVRmaJH)
వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్ట ణంలో గ్రామ దేవత (బొడ్రాయి) ద్వితీయ వార్షికో త్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజాము నుంచే భక్తులు గ్రామ దేవతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు బారులుదీరారు. బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి పర్యవేక్షణలో అర్చక పురోహితులు గుడి రాధాకృష్ణమూర్తి, తాటిపాముల దుర్గాప్రసాద్, చిట్టా శ్రీకాంత్ శాస్త్రి, మారేపల్లి కౌశిక్ శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోపూజ, విఘ్నేశ్వర పూజ, స్థల శుద్ధి, స్వస్తివాచనం, రక్షా సూత్రధారణం, అంకురార్పణం, జలాభిషేకం, పంచామృత అభిషేకాలు, మంటప పూజ లు, మూలమంత్ర జపాలు జరిపారు. గణేష, దుర్గ, శాంతి, పౌష్టిక, రుద్ర, మూలమంత్ర యజ్ఞాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపి, బలి ప్రదానం, కుంభాభిషేకం, పంచబోనాల సమర్పణ, భక్తజనులకు ఆశీర్వచనం నిర్వహించారు. బొడ్రాయికి ముత్యాలమ్మ కుమ్మరి పూజారులు బొడ్డుపల్లి వంశీకుల తరఫున మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు.
ఎమ్మెల్యే దంపతుల పూజలు..
బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్–ఉమ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొడ్రాయికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా బొడ్రాయి వార్షికోత్సవం నేపథ్యంలో పట్టణంలోని పలు దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ముత్యాలమ్మ దేవాలయాల్లో జంతుబలి ఇచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి,జెన్నారెడ్డి మురళీధర్ రెడ్డి,పాల్వాయి రా మ్మోహన్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల రమేశ్, పిల్లి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ,విద్యుత్ డీఈ విజయ్,భక్తులు పాల్గొన్నారు.
పూజలు చేసిన ఎమ్మెల్యే
మురళీనాయక్–ఉమ దంపతులు
బారులుదీరి మొక్కులు
చెల్లించుకున్న భక్తులు
![వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12mbd702-603343_mr-1739413980-1.jpg)
వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం
![వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం2](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12mbd704-603343_mr-1739413980-2.jpg)
వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం
Comments
Please login to add a commentAdd a comment