స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
పెద్దవంగర: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించి సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం చేపట్టారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి దయాకర్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇంకా అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజులన్నీ బీఆర్‌ఎస్ పార్టీవే అని వివరించారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పస్టం చేశారు. బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment