మహబూబ్‌నగర్: చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదం తర్వాత లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. బుధవారం రాత్రి బిల్లు ఆమోదం పలికింది.
ఈ నేపథ్యంలో రాజకీయంగా చోటుచేసుకోనున్న పరిణామాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2027 తర్వాతే మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 7 నియోజకవర్గాల్లో మాత్రమే మహిళలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం దక్కింది. మిగతా ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక్కరికి అవకాశం రాలేదు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది మాత్రమే మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళా అభ్యర్థి గెలుపొందలేదు. పార్లమెంట్ ఉభయసభలతో పాటు మెజార్టీ రాష్ట్రాల ఆమోదం పొందితే మహిళా బిల్లు అమలులోకి వస్తుంది. 2027 తర్వాత జరిగే ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment