గోదాం తగలబెట్టిన దోషుల సంగతేంటి?
పెబ్బేరు రూరల్: స్థానిక మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి 7 నెలలు గడిచినా నేటికీ నేరస్తులను పట్టుకోలేదని పోలీసుల తీరుపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గురైన మార్కెట్ యార్డు గోదాంతో పాటు కాలిపోయిన సంచులను రాచాల యుగంధర్‌గౌడ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారిక లెక్కల ప్రకారం గోదాంలో 12.94 లక్షల గన్నీ బ్యాగులు నిల్వ చేయగా.. అగ్ని ప్రమాదంలో అవి కాలి పోయాయని, వాటి విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. అదేవిధంగా 3 గోదాంలు సైతం ఎందుకూ పనికి రాకుండా పోయాయని, వాటి నిర్మాణానికి సైతం రూ.10 కోట్లు ఖర్చవుతుందని, వీటన్నింటికీ బాధ్యులెవరని, ఎందుకు వారిని శిక్షించడం లేదని ప్రశ్నించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగితే అధికారులు దాటవేస్తున్నారని, గోదాంలో కరెంట్ కనెక్షనే లేనప్పుడు షార్ట్‌సర్య్కూట్ ఎలా అవుతుందన్నారు. ఘటనకు 3 రోజులు ముందు డీఎస్‌ఓ సెలవుపై వెళ్లడం, పోలీసుల కాలయాపనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఈ ఘటనకు కారుకులెవరో తేల్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డికి, సంబంధిత మంత్రికి, డీజీపీకి సమస్యను విన్నవిస్తానన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్నగౌడ్, నాయకులు సితార వెంకటేశ్వర్లు, రాఘవేందర్, యాదగిరి, రమేష్, మ్యాదరి రాజు, నాగరాజు, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.
మద్యం అక్రమ తరలింపు
కేసులో ఒకరి అరెస్ట్
అయిజ: నకిలీ మద్యంను విక్రయించే ముఠాలో ఒకరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి అయిజ పట్టణ శివారులో ఇద్దరు వ్యక్తులు కారులో 6లీటర్ల నకిలీ మద్యం తరలిస్తున్నారు. గద్వాల స్టేషన్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. గట్టు మండలంలోని తుమ్మలపల్లెకి చెందిన ఈడిగ చిన్నఉరుకుందు గౌడ్‌ను అరెస్ట్ చేశారు. అదేగ్రామానికి చెందిన బోయ రవినాయుడు, బోయ రమేష్ నాయకుడు, ఈడిగ పెద్ద ఉరుకుందు పరారీలో ఉన్నారు. వాహనాన్ని సీజ్ చేసి మొత్తం నలుగురి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి, ఎస్‌ఐలు వెంకటేష్, వీరేశలింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment