సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం
ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరూ బాపు బాటలో పయనించి సమసమాజ స్థాపనకు కృషి చేయాలని విశ్రాంత జిల్లా విద్యాధికారి ఎస్.విజయ్‌కుమార్ కోరారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో చేపట్టిన సత్య శోధనయాత్ర మంగళవారం రాత్రి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడే బస చేసిన ఆయన బుధవారం ఉదయం సోళీపురం మీదుగా వెళ్తుండగా.. మానాజీపేట గేట్ దగ్గర గ్రామానికి చెందిన యువత ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. అక్కడే రైతులను కలిసిన ఆయన జీవన విధానంపై పలు సూచనలు చేశారు. సత్యశోధన యాత్ర అక్టోబర్ 2న అలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి ప్రారంభించామని.. 100 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి 2025, జనవరి 12న అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర ఆలయం దగ్గర ముగుస్తుందని చెప్పారు. ఈ యాత్ర ముఖ్య ఉద్ధేశం చేనేత వస్త్రధారణను ప్రోత్సహించడం, మద్యం, మత్తు పదార్థాల నియంత్రణ, స్వదేశీ వైద్యం (ఆయుర్వేదం)ను ఆదరించడం, సేంద్రియ సాగును ప్రోత్సహించడం, యోగా, పౌష్టికాహారం, ప్రకృతి, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, పని, సంస్కృతిని పెంపొందించడం, సత్యం, అహింస పునాదులుగా సమసమాజ స్థాపన వైపు అడుగులు వేసేలా ప్రజలు, విద్యార్థులను చైతన్యం చేయడమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment