కణతి మాంసం స్వాధీనం
అచ్చంపేట రూరల్: విద్యుత్ కంచె వేసి అటవీ జంతువు కణతిని వేటాడి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో 9 మంది వేటగాళ్లను అరెస్టు చేసినట్లు అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ సుబూర్ తెలిపారు. బుధవారం అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని చేదురుబావితండాలో కణితి మాంసం దాచారని విశ్వసనీయ సమాచారంతో అటవీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. రాజు అనే వ్యక్తి ఇంట్లో కణతి మాంసంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు జానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 7మంది కణతిని వేటాడినట్లు గుర్తించారు. బల్మూర్ మండలం బిల్లకల్ అటవీ సమీపంలో కాశీం అనే వ్యక్తితో పాటు మరికొందరు విద్యుత్ కంచెతో కణతిని చంపారు. చేదురుబావితండాలో మాంసాన్ని విక్రయిస్తున్నారని తెలియడంతో దాడులు నిర్వహించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. కణతిని వేటాడిన 9మందిని కల్వకుర్తి కోర్టులో హాజరు పర్చగా నిందితులకు జడ్జి రి మాండ్‌కు ఆదేశించారు. అటవీ జంతువులను వేటాడి చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌ఓ హెచ్చరించారు.
● తొమ్మిది మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment