షార్ట్‌సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
మరికల్: షార్ట్‌సర్క్యూట్‌తో ఓ పెంకుటిల్లు దగ్ధమైంది. ఆరేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులు కళ్ల ముందే అగ్ని ఆహుతి అయ్యాయి. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎలిగండ్లలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఎలిగండ్ల గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లు కష్టపడి కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5.35లక్షలను జమ చేశాడు. రెండు రోజుల్లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలనుకున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం ముగించుకొని ఇంట్లో నిద్రించారు. అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కావటంతో ఇంట్లోని సామగ్రికి మంటలు అంటుకున్నాయి. నిద్రలేచిన కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. క్షణాల్లో ఇంట్లో ఉన్న సామగ్రితో పాటు ఇంటి నిర్మాణం కోసం ప్లాస్టిక్ డబ్బాలో దాచిన రూ.5.35లక్షలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై ఆర్ఐ సుధాకార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ స్తులు తహసీల్దార్‌కు విన్నవించారు.
ఇంట్లో దాచిన రూ.5లక్షలు అగ్నికి ఆహుతి
Comments
Please login to add a commentAdd a comment