ఆరోగ్యశ్రీ కేసులు తిరస్కరించొద్దు
పాలమూరు: జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులు మరింత పెంచాలని, కేసు రిజిస్ట్రేషన్ చేయడం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిచేయాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్ అన్నారు. జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలతో బుధవారం ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సూపరింటెండెంట్‌తోపాటు హైదరాబాద్ నుంచి ఆరోగ్యశ్రీ నిపుణుడు డాక్టర్ కేవీఎన్ దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడారు. రోగుల వివరాలను ఆరోగ్యశ్రీ డీవోలు వార్డుకు వెళ్లి సేకరించాలని, ఆరోగ్య మిత్రలు మూడు షిఫ్ట్‌లలో డ్యూటీ రోస్టర్ తయారు చేసుకొని దాని ప్రకారం పని చేయాలన్నారు. కేసు రిజక్ట్ కాకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలపై తెలియజెప్పారు. ప్రతి కేసులో ఒరిజినల్ కేషీట్ ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. రిజక్ట్ అయిన ఆరోగ్యశ్రీ కేసుల నెలవారి వివరాలను డీవోలు సంబంధిత హెచ్‌వోడీ విచారించి తిరస్కరణకు గల కారణాలు చెప్పాలన్నారు. ప్రతిరోజు ఆరోగ్యశ్రీ కేసుల రిపోర్ట్ వివరాలను సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్‌ఎంఓ డాక్టర్ జరీనా, అన్ని విభాగాల హెచ్‌వోడీలు, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment