ఆరోగ్యం కాపాడుకుంటూ గస్తీ..
ఈ మధ్య చలి విపరీతంగా పెరిగింది. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించి నైట్ డ్యూటీ చేస్తున్నాం. ప్రతి రోజు రాత్రి 11 నుంచి తెల్లారి ఉదయం ఐదు గంటల వరకు పెట్రోలింగ్‌లో భాగంగా టూటౌన్ పరిధిలోని అన్ని కాలనీల్లో గస్తీ నిర్వహిస్తాం.
– పోశెట్టి, టూటౌన్ ఏఎస్‌ఐ
ఇబ్బందులు అధిగమించి విధులు..
నైట్ డ్యూటీ అంటే ముందుగానే సిద్ధమవుతాం. చలి నేపథ్యంలో జర్కిన్, తలకు టోపీ, గ్లౌజ్ వంటివి వేసుకోవడంతో పాటు వేడినీళ్లు తాగడం చేస్తుంటాం. ద్విచక్ర వాహనంపై పెట్రోలింగ్‌కు ఇబ్బందులు ఉన్నా.. అధిగమించి మా విధులు నిర్వర్తిస్తున్నాం.
– రఘు, కానిస్టేబుల్, వన్ టౌన్ పీఎస్
Comments
Please login to add a commentAdd a comment