నైపుణ్య శిక్షణ కేంద్రం పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పా టు చేస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. దీనిని తొందరగా అందుబాటులోకి తీసుకునిరావాలని మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. కాగా, ఇక్కడ త్వరలోనే మూడు నెలల షార్ట్‌టర్మ్ వివిధ కోర్సులకు సంబంధించి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే తనిఖీ
స్థానిక 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి తనిఖీ చేశారు. లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు.
● జనవరిలో ‘ప్రజాపాలన’ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం 49 వార్డులకు గాను 35,861 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేయర్లు ఇంటింటికీ వెళ్లి ఈ పథకానికి అర్హులా? కాదా? అని తేలుస్తున్నారు. అయితే ఈనెల 9 నుంచి ఇప్పటివరకు కేవలం 20 శాతమే ఈ సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. తరచూ సాంకేతిక సమస్యలతో సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment