మ్యాథ్స్ పార్క్‌తో సులభంగా..
సులభంగా గణిత ప్రక్రియలు నేర్చుకునేందుకు వీలుగా మహబూబ్‌నగర్‌లోని నాగార్జున పాఠశాల విద్యార్థులు అలేఖ్య, హిమశ్రీలు మ్యాథ్స్ పార్కులు ఆవిష్కరించారు. పార్కులో ఆడుకుంటూ అక్కడ ఉండే ఒక్కో ఆట వస్తువుతో ఒక్కో విధమైన గణిత ప్రక్రియ ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా వివిధ గణిత సూత్రాలు, ప్రక్రియలు, చతుర్విత ప్రక్రియలు, లెక్కలు నేర్చుకునేందుకు అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. దీని ఆధారంగా పార్క్‌లను ఏర్పాటు చేస్తే విద్యార్థులు మర్చిపోకుండా గణితం చేర్చుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభచాటారు.
Comments
Please login to add a commentAdd a comment