17వ రోజుకు చేరినఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించి, కనీస వేతన స్కేల్ ఇవ్వాలని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం 17వ రోజుకు చేరింది. వీరికి బీసీటీఏ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమ డిమాండ్లను జాక్టో తరఫున రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆయా సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, కోశాధికారి మల్లేష్, సంఘం నాయకులు శివకుమార్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment