భూమి లేని పేదలకు రూ.12 వేలు ఇవ్వాలి
జడ్చర్ల టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమి లేని పేదలకు తక్షణమే రూ.12 వేలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో నిర్వహించిన వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు మ్యాపులు అవసరం లేదని, ప్రభుత్వం వద్ద ఉన్న డాటా ప్రకారం పేదలందరికీ ఇళ్లు కట్టుకోవడానికి వెంటనే డబ్బులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలకు తావు లేకుండా అర్హులందరికీ కేటాయించాలన్నారు. లేకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జగన్, కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు హన్మంతు, సహాయ కార్యదర్శి పాండు, సభ్యులు శివలీల, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment