న్యాయవాదులు పరిజ్ఞానం పెంచుకోవాలి
పాలమూరు: కొత్త ఏడాదిలో న్యాయవాదులు విధుల పట్ల అంకితభావంతో ఉంటూ.. విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదుల ముఖా ముఖి కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి హాజరై కేకు కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఆనందంగా జీవనం సాగించాలన్నారు. జిల్లాకు వచ్చిన న్యాయమూర్తులు న్యాయవాదుల పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాధిక, శారదాదేవి, శ్రీదేవి, మమతారెడ్డి, నిహారిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment