ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత 24 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 24 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకుండా ఉండటం దారుణమన్నారు. వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, ఖాజామైనొద్దీన్, అక్రమ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment