వచ్చీరాని వైద్యం..!
పేదల అమాయకత్వమే.. పెట్టుబడి
వివరాలు 8లో u
● జిల్లాలో మితిమీరుతున్న ఆర్‌ఎంపీల ఆగడాలు
● స్థాయికి మించి వైద్యసేవలతో ప్రాణాల మీదకు..
● కొందరిని ప్రైవేట్‌కు సిఫార్సు చేసి కమీషన్ల వసూలు
● ప్రత్యేకంగా వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న యాజమాన్యాలు
● నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న వైద్యాధికారులు
పాలమూరు: కనీస అర్హత లేకపోయిన వైద్యుడిగా చెలామణి అవుతారు.. అనుమతులు తీసుకోకుండానే క్లినిక్‌లు ఏర్పాటు చేస్తారు. యథేచ్ఛగా వైద్యం అందిస్తారు. అది కూడా ప్రాథమిక వైద్యం కాకుండా.. ఎంబీబీఎస్ మాదిరిగా పెద్దపెద్ద రోగాలకు సైతం వైద్యం చేస్తూ.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాగే కొందరు రోగులను పట్టణాల్లోని ఇతర వైద్యుల దగ్గరకు పంపిస్తూ కమీషన్లు రాబడుతున్నారు. అధికారుల అలసత్వాన్ని అర్హతగా చేసుకొని.. పేదల అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకొని.. జిల్లాలోని ఆర్‌ఎంపీలు నిత్యం రూ.వేలు సంపాదిస్తూ.. రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆర్‌ఎంపీలకు వేతనాలు ఇచ్చి మరీ ప్రోత్సహించే స్థాయికి చేరుకున్నారు.
విధిలేని పరిస్థితిలో..
గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సరైన వైద్యం అందకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులకు ఫీజు చెల్లించే స్థోమత లేనివారు విధిలేని పరిస్థితిలో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీరిలో కొద్ది మంది ఆర్‌ఎంపీలు మాత్రమే ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారు. కానీ, చాలామంది ఆర్‌ఎంపీలు మాత్రం చిన్నపాటి శస్త్రచికిత్సలు సైతం చేస్తూ ఇన్‌ఫెక్షన్లు, ఇతరత్రా ఇబ్బందులకు కారణమవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులున్నా.. వారు తమ సొంత ఆస్పత్రులకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులకు సరైన వైద్యం చేయకపోవడంతో నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత రోగులు స్థానికంగా అందుబాటులో ఉండే ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి.. జేబు చమురు వదుల్చుకోవడమే కాకుండా.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment