స్టేషన్ మహబూబ్‌నగర్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మహబూబ్‌నగర్ అర్బన్ మండలానికి చెందిన 35 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరుపైనే మంజూరు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment