జిల్లాలో గతేడాది కంటే ఈసారి చోరీలు పెరిగాయి. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో చోరీలు గణనీయంగా పెరగగా.. సొమ్మును రికవరీ చేయడంలో మాత్రం పోలీసులు వెనుకంజలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం రూ.3,83,99,107 సొమ్ము అపహరణకు గురవగా.. రూ.1,05,20,810 రివకరీ చేసినట్లు పోలీసులు లెక్కల్లో చూపించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇంకా తక్కువగానే బాధితులకు అందినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దొంగతనాల్లో ఎత్తుకువెళ్లిన మొత్తం సొమ్ము విలువను కేసుల్లో చూపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment