సమగ్రశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద సమగ్రశిక్ష ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరసనలో భాగంగా ఆదివారం చీపురులు పట్టి రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హనుమకొండలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం కుంటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ఉద్యోగ భద్రత లేక భయంగా జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తర్వాత విధుల్లో చేరిన రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలు పెరగడంతోపాటు ప్రమోషన్‌లు కూడా పొందారని, వారితో సమానంగా పనిచేస్తున్న తమ వేతనాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదని, ఏళ్ల తరబడిగా అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నామని వాపోయారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, యాదగిరి, చంద్రశేఖర్, మంజుల, హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment