కొత్త కిక్కు..!
న్యూ ఇయర్ వేడుకల్లో తెగ తాగేశారు
● నాలుగు రోజుల్లో రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు
● ఉమ్మడి జిల్లాలో మందుబాబుల రికార్డు
● వ్యాపారులు, ఆబ్కారీశాఖకు కాసుల పంట
● డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 207 మంది వాహనదారులు
మహబూబ్‌నగర్ క్రైం: మందుబాబులు.. తెగ తాగేశారు. ఎకై ్సజ్‌శాఖకు మాంచి కిక్కిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. మందుతో పాటు మాంసం, కేక్‌లు, బిర్యానీలు ఇలా అన్ని రకాల వ్యాపారం దాదాపు రూ.వంద కోట్ల వరకు జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్ లిక్కర్ విక్రయాలున్నాయి. మందు బాబులు పెగ్గుమీద పెగ్గు లాగించి.. కిక్కులో మునిగి తేలారు. న్యూ ఇయర్ వేడుకలు ఉన్న నేపథ్యంలో వ్యాపారులు మద్యం డిపో నుంచి అధికంగా మందు తీసుకొచ్చి నిల్వ చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు కొనసాగడంతో వ్యాపారులు, ఆబ్కారీశాఖకు కాసుల పంట పండింది. గతేడాది కంటే ఈసారి ఐఎంఎల్ 10 శాతం విక్రయాలు పెరగడంతో.. మద్యం ప్రియులు రికార్డు సృష్టించారు.
● పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో బార్లు, మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్‌లకు అనుమతి ఉండటం వల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 90, నాగర్‌కర్నూల్ జిల్లాలో 67, వనపర్తిలో 37, గద్వాలలో 36 మద్యం దుకాణాలున్నాయి. కాగా.. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉండగా.. జడ్చర్లలో రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, కొత్తకోట ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment