జాతీయస్థాయి రగ్బీ పోటీలకు 8మంది ఉమ్మడి జిల్లా క్రీడాకార
మహబూబ్‌నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం పాట్నాలో వచ్చే నెల 1, 2 తేదీల్లో జరిగే 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. తెలంగాణ బాలబాలికల జట్లలో 8 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. బాలుర జట్టులో కె.శివ (జెడ్పీహెచ్‌ఎస్, గార్లపహాడ్), శివకుమార్ (జెడ్పీహెచ్‌ఎస్, మద్దూర్), తిరుమలేష్ (గద్వాల), బాలికల జట్టులో రాధిక (జెడ్పీహెచ్‌ఎస్, గొండ్యాల), మీనాక్షి (బాలానగర్, గురుకుల), ఉర్కుందమ్మ (గద్వాల), సుచిత్ర (సజ్జఖాన్‌పేట) రాష్ట్ర బాలికల జట్టులో ఉన్నారు. తెలంగాణ జట్లు సోమవారం పాట్నాకు తరలివెళ్లాయి. క్రీడాకారులను జిల్లా రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రావు, ఉపాధ్యక్షులు ఉమాపతిరెడ్డి, కోశాధికారి బాల్‌రాజు అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభచాటి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment