కబడ్డీ చాంపియన్ రంగారెడ్డి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ సోమవారం ఉత్సాహంగా ముగిసింది. టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో రంగారెడ్డి జట్లు చాంపియన్‌షిప్‌లను కై వసం చేసుకున్నారు. పురుషుల రన్నరప్‌గా వనపర్తి, మహిళల రన్నరప్‌గా నల్లగొండ జట్లు, పురుషుల విభాగంలో మూడోస్థానంలో నల్లగొండ, మహిళల్లో హైదరాబాద్ జట్లు నిలిచాయి.
● పురుషుల విభాగం రంగారెడ్డి, వనపర్తి జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మొదటి అర్ధబాగంలో 18–16 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న వనపర్తి జట్టు రెండో అర్ధభాగంలో తడబడింది. చివరగా ఆట ముగిసే సమయానికి రంగారెడ్డి 34–31 పాయింట్ల తేడాతో వనపర్తిపై విజయం సాధించి విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 57–39 పాయింట్ల తేడాతో నల్లగొండపై నెగ్గింది. పురుషుల మూడోస్థానం మ్యాచ్‌లో నల్లగొండ జట్టు 48–33 పాయింట్ల తేడాతో నారాయణపేటపై, మహిళల మూడోస్థానం మ్యాచ్‌లో హైదరాబాద్ 34–31 పాయింట్ల తేడాతో గద్వాల విజయం సాధించాయి. అంతకుముందు జరిగిన పురుషుల విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 46–30 పాయింట్ల తేడాతో నల్లగొండ జట్టుపై, వనపర్తి 44–35 తేడాతో నారాయణపేట జట్టుపై గెలిచాయి. మహిళల విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో నల్లగొండ 53–27 పాయింట్ల తేడాతో హైదరాబాద్‌పై, రంగారెడ్డి 38–29 పాయింట్ల తేడాతో గద్వాలపై గెలుపొందాయి.
● ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి సోమవారం పోటీలను తిలకించారు. పురుషుల, మహిళల ఫైనల్ మ్యాచ్‌ను టాస్‌వేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాజట్లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌పీ వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా వాలీబాల్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, జిల్లా కబడ్డీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శులు పాపారాయుడు, బాల్‌రాజు, వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్‌చార్జీ ఎస్.విజయ్‌కుమార్, డీఎస్‌ఏ సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. టోర్నీలో గెలుపొందిన జట్లకు త్వరలో హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ట్రోఫీలు, మెడల్స్ అందజేస్తారని డీవైఎస్‌ఓ తెలిపారు.
మహిళలు, పురుషుల విభాగాల్లో విజయం
ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ టోర్నీ
పురుషుల రన్నరప్‌గా వనపర్తి, మూడో స్థానంలో నల్లగొండ
మహిళల రన్నరప్‌గా నల్లగొండ, మూడో స్థానంలో హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment