పత్తి తూకంలో గోల్‌మాల్
పంప్‌మోడ్ పద్ధతిలో 11,579 క్యూసెక్కులు తరలింపు
దోమలపెంట: భూగర్భ కేంద్రంలో పంప్‌మోడ్ పద్ధతిలో 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఆనకట్ట దిగువన సాగర్ జలాశయం నుంచి ఆనకట్ట ఎగువన శ్రీశైలం జలాశయంలోకి 11,579 క్యూసెక్కుల నీటిని (ఎత్తిపోతల) తరలించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, ముచ్చమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,710, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 490, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 862.0 అడుగుల వద్ద 112.2100 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లోలు స్వల్పంగా వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 1,400 క్యూసెక్కులు ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 89 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 200 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి మొత్తం 289 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.087 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
బిజినేపల్లి: రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయిస్తే వారు ఎలక్ట్రానిక్ కాంటాల్లో రిమోట్లను ఏర్పాటు చేసి భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పేటకు చెందిన రైతు ధన్వాడ నాగరాజు ఆదివారం ఉదయం వేబ్రిడ్జిపై పత్తి తూకం చేయగా 11.65 క్వింటాళ్లుగా చూపింది. అదే పత్తిని బిజినేపల్లిలోని రాముగౌడ్ అనే దళారి వద్ద విక్రయించేందుకు తీసుకొచ్చారు. ధర రూ.6,900 నిర్ణయించి తూకం వేసి 8.11 క్వింటాళ్లుగా చూపారు. దీంతో కంగుతిన్న రైతు దుకాణం ఎదుట తోటి రైతులతో కలిసి ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. రైతు నుంచి ఫిర్యాదు తీసుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నామని.. మోసం చేసినట్లు తేలితే కేసు నమోదు చేస్తామని వివరించారు.
ఆటో డ్రైవర్లతో కలిసి మోసాలు?
బిజినేపల్లిలో దళారులు దుకాణాల వద్ద ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు కొందరు ఆటో డ్రైవర్లతో కుమ్మకై ్క ఒక్కో సంచికి రూ.200 వరకు కిరాయి కూడా దళారే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లు, దళారులు కలిసి చేసే మోసాలకు రైతులు బలవుతున్నారు. ఒకవేళ మోసం బయటపడితే నాయకులు రంగంలోకి దిగి సెటిల్‌మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. దళారుల మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు అటువైపు కూడా చూడటం లేదని సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు
Comments
Please login to add a commentAdd a comment